బీఆర్ఎస్ పైన మందా జగన్నాథం తిరుగుబాటు

1 min read

బీఆర్ఎస్ లో మరో నేత తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. అలంపూర్ అభ్యర్థి అబ్రహం ను మార్చాలని సీనియర్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం డిమాండ్ చేశారు. తన కొడుకు మందా శ్రీనాథ్ కు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అబ్రహం పైన తీవ్ర వ్యతిరేకత ఉందని, చిత్తుగా ఓడిపోతాడని జగన్నాథం తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పైన, కేసీఆర్ మీద నియోజకవర్గంలో వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. తక్షణమే కేసీఆర్ కలుగజేసుకొని అలంపూర్ అభ్యర్థిని మార్చాలని జగన్నాథం డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn