మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె వివాహం

కేంద్రమాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక టిడిపి అభ్యర్ధి శ్రీమతి పనబాక లక్ష్మి, కృష్ణయ్య గారి కుమార్తె వివాహ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన వేడుకలకు హాజరై నూతన వధూవరులు రచన(డిప్యూటి కలెక్టర్), డా భార్గవ శేఖర్(ఐఆర్ ఎస్) లను చంద్రబాబు ఆశీర్వదించారు.