గుర్తు పట్టకుండా మారిపోయిన మాజీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నాడా..? చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికి యాక్టివ్ గా మాత్రం లేడు. ఆయన రాజకీయ భవిష్యత్తుపైన అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరతాడని, తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాడని పుకార్లు వస్తున్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం స్పందించడం లేదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదు. దీంతో అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఎలా ఉన్నారన్న విషయాన్ని కూడా జనం మరిచిపోయారు. అయితే తాజాగా ఆయన వీడియో ఒకటి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. మాజీ పీసీసీ ఛీప్ రఘవీరారెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురంలో నిర్మిస్తున్న ఆలయాలకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆలయ విశిష్ఠతను వివరిస్తు రఘవీరారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తిగా నెరిసిపోయిన జుత్తు, గడ్డంతో కిరణ్ లుక్ పూర్తిగా మారిపోయింది.
