మాజీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడి పెళ్లి
1 min read
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహం హైదరాబాద్ లో జరిగింది. పెద్దగా హడావుడి లేకుండా బంధువులు, రాజకీయ ప్రముఖుల మధ్య పెళ్లి జరిపారు. ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు మూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహారించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఆయన తన సి.ఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంద్ర కోసం పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత రాజకీయాల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంత క్రియాశీలక పాత్ర పోషించడం లేదు.