ఢిల్లీకి ఈటెల, రాజగోపాల్ రెడ్డి
1 min readపార్టీ వైఖరీపైన అసంత్రుప్తిగా ఉన్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్టానం ఆహ్వానం మేరకు వీరిద్దరు హస్తినబాట పట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కూడా వీరు కలిసే అవకాశం ఉంది. పార్టీ పనితీరుపైన ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అసంత్రుప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరడానికి వీరు సిద్ధమౌతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి చేరిక లాంఛనమేనని కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పైన పోరాటం విషయంలో బీజేపీ మెతకవైఖరీ అవలంభిస్తుందని ఈటెల,రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణం ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. దీంతో వీరిద్దరిని పార్టీ అధిష్టానం ఢిల్లీ పిలిపించింది. పార్టీలో సమస్యలతో పాటు వీరు అనుమానాలపైన జెపి నడ్డా, అమిత్ షా వివరణ ఇవ్వనున్నారు.