సంజయ్.. ఊరికిచ్చి కొడతరు

1 min read

ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలులో పెట్టించే దమ్ము బీజేపీకి ఉందా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన ఆయన విరుచుకుపడ్డారు. ఆయననో కొత్త బిక్షగాడన్న ఎర్రబెల్లి కార్పొరేటర్ స్థాయి కూడా లేదని ధ్వజమెత్తారు. కరీంనగర్ ప్రజలు సానుభూతితో గెలిపించారని మంత్రి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం మూడో టీఎంసిని కావాలనే అడ్డుకున్నారని, ఉత్తర తెలంగాణ ప్రజలు ఊరికించి కొట్టడం ఖాయమని ఆయన అన్నారు. మీడియాలో ప్రచారం కోసం సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ ను అడ్డం పెట్టుకొని మతకలహాలు స్రుష్టించడం కోసం సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఎర్రబెల్లి ఆ పార్టీపైన తీవ్ర విమర్శలు చేయడం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn