గురకుల పాఠశాలకు డీప్యూటీ సీఎం భట్టి
1 min readజగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పాముకాటు కు గురై చనిపోయారు. ఈ నేపథ్యంలో డీప్యూటీ సీఎం భట్టి స్కూల్ ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల మృతి యావత్తు ప్రభుత్వాన్ని కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రజా ప్రభుత్వం పై ఉన్నందునే జరిగిన విషయాలను నేరుగా తెలుసుకోవడానికి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని, వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాల ప్రాంగణాలను పక్కా భవనాలను ప్రహరీ గోడలతో సహా అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దుతామన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం కల్పిస్తాం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది మేము మా ప్రభుత్వంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని భట్టి అన్నారు.