ఆ భూములపైన బీఆర్ఎస్ దుష్పచారం
1 min read
HCU భూముల వివాదంపై మంత్రుల మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కంచె గచ్చిబౌలి భూములు 2004 వరకు 400 ఎకరాల భూమి HCU కు సంబంధించినదేనని భట్టి వివరించారు. అయితే 400 ఎకరాలకు బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఆ భూములు మావి అని.. బిల్లీ రావు అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడని,ఆ 400 ఎకరాల భూమిని పదేళ్ళు పాలన చేసిన BRS ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు.
ఈ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండాలని గత పాలకులు కోరుకున్నారని, కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధాల మీద బతుకుతున్నాయని ధ్వజమెత్తారు. హెచ్ సీయూ కి 2004లోనే IMG భారత్ కోసం తీసుకున్న భూమికి బదులుగా 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి ఇవ్వబడిందన్నారు. మేం కోర్టులో కేసు వేసి గెలిచి ప్రజల ఆస్తులు కాపాడం. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రజలకు చెందేటట్లు చేశామని భట్టి తెలిపారు. ప్రజల ఆస్తులు కాపాడిన మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పజెప్తామని ఆయన ప్రశ్నించారు. ఇంచు భూమి కూడా వదలొద్దని క్యాబినెట్ లో నిర్ణయించామని, అస్థిత్వం, ఆత్మ గౌరవం కోసం ఏండ్లుగా పోరాటం చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకులు బాగు పడతాయని ప్రజలు నమ్మారు. పదేండ్లు ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ పాలన చేశారని భట్టి ధ్వజమెత్తారు. HCU భూముల వ్యవహారంలో BRS ద్వంద్వ వైఖరి సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
యూనివర్సిటీ భూములను గుంజుకుంటున్నట్లు చెప్తున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై మాకు చాలా ప్రేమ ఉందన్నారు. విద్యార్థులు ఒక్కసారి ఆలోచించాలని భట్టి సూచించారు.