సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని స్రుష్టించింది. ఏకంగా మూడో వంతు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసినా ముప్పై శాతానికి మించకపోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ 7000 కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇండిపెండెంటులు గా మరో 1500 మంది సర్పంచ్ లు గెలిచారు. వీరిలో 70 శాతం కాంగ్రెస్ చు చెందిన వారే కావడం విశేషం. వీరితో కలిపితే కాంగ్రెస్ 8000 సర్పంచ్ లు గెలిచినట్లు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 3500 , బీజేపీకి 688 సర్పంచ్ స్థానాలు వచ్చాయి. ఒకటి రెండు జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని పొందింది.
