ఆస్పత్రి నుంచి ఇంటికి సోనియా గాంధీ
1 min readకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపుగా రెండు వారాల నుంచి ఆమె కరోనాతో ఇబ్బందిపడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కదుటపడటంతో సోనియా గాంధీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె కరోనా బారిన పడటంతో విచారణ వాయిదా పడంది. తాజాగా సోనియా కోలుకున్న నేపథ్యంలో ఈడీ మరో సారి నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇదే కేసులో రాహుల్ గాంధీని నాలుగు రోజుల పాటు ఈడీ విచారించింది.