నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు
1 min read
నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డిపైన ప్రధాన పార్టీలు అభ్యర్థులను పోటీకి దింపలేదు. దీంతో ఆయన ఏకగ్రీవం ఖాయమని భావించారు. కాని ఆలేరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నగేష్ నామినేషన్ తో పోటీ ఖాయమైంది. తెలంగాణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరుపున నగేష్ బరిలోకి దిగారు. తాజాగా ఆయన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోకు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నగేష్ కు సహకారంపైన కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ తరుపున మద్దతు ఇస్తామని తెలిపారు. మరో వైపు నగేస్ కు మద్దతుపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గతంలో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.