గోడలపైన పేరు కూడా ఓర్వలేరా..?
1 min readటీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ అధికారుల తీరుపైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గోడలపైన రాసిన నినాదాలను తూడ్చివేయడంపైన అభ్యంతరం చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు జాగ్రత్తలు చెపుతు రాసిన రాతలను ఎందుకు తొలగించారని సీతక్క ప్రశ్నించారు. స్థానికంగా కొందరు నేతలు ఓర్వలేకనే ఈ పనిచేశారని ఆమె ధ్వజమెత్తారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం ప్రాంతంలో ఇసుక లారీలను నిషేధించాలని సీతక్క డిమాండ్ చేశారు.