ఫాక్స్ కాన్ కంపెనీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
1 min readకొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమావేశమయ్యారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ కంపెనీని రేవంత్ రెడ్డి కోరారు.