రెండు పార్టీలకు ఒకేసారి షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
1 min readబీఆర్ఎస్, బీజేపీ లకు సీఎం రేవంత్ రెడ్డి ఒకే సారి షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరికి గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ లో చేరుతున్నానని బాపు రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొందరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్నారు.