రేవంతన్న సన్న బియ్యం.. గేమ్ ఛేంజర్

1 min read

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం గేమ్ ఛేంజర్ గా మారింది. పేదోడి కంచంలో సన్న బియ్యం బువ్వ ఉండాలన్న ముఖ్యమంత్రి సంకల్పం ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది. ఇంత కాలం దొడ్డు బియ్యం తినలేకపోయిన నిరుపేదలు ఇప్పుడు సన్న బియ్యం తో సంబరాలు చేసుకుంటున్నారు. రేషన్ షాపుల ముందు క్యూ కట్టి మరీ బియ్యం తీసుకుని సంతోషంగా ఇంటికి తీసుకెళ్తున్నారు. దొడ్డు బియ్యం తినలేక అమ్ముకున్న పేదలు సన్న బియ్యాన్ని కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం పథకం వల్ల ప్రతి పేద కుటుంబం నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఆదా చేసుకోనుంది. 

                  రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంత కాలం నుంచి ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సన్న వడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుంది. ఈ స్కీం వల్ల పేదలతో పాటు రైతులు కూడా లబ్ధి పొందుతున్నారు. సన్న బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుండటం విశేషం. మరో వైపు సన్న బియ్యం పథకాన్ని విసృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పేదల ఇళ్లలో భోజనం చేస్తున్నారు.

 


మరో వైపు సన్న బియ్యం స్కీమ్  పైన రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతుండటంతో ప్రతిపక్షాలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాయి.రేవంత్ రెడ్డి సర్కార్ ఏ పథకం ప్రవేశపెట్టినా నిత్యం విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఈ పథకం గురించి నోరు మెదపడం లేదు. సన్న బియ్యం స్కీమ్ పైన విమర్శలు చేస్తే పేదల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయం వెంటాడుతుండటంతో మౌనంగా ఉంటున్నారు.  ఇదే సమయంలో బీజేపీ నాయకులు కొంత రాజకీయ విమర్శలు చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. ఇంత కాలం కేంద్రం ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేదన్న ప్రశ్నకు బీజేపీ నాయకుల దగ్గర సమాధానం లేదు. 

ఎవరెన్ని చేసినా సన్న బియ్యం పథకం సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పనిసరి గా కొనసాగించాల్సిన పరిస్థితి ఆయన కల్పించారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో రేవంతన్న సన్న బియ్యం సూపర్ సక్సెస్ స్కీమ్ . ఇది మాత్రం తిరుగులేని నిజం.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn