రైల్వేలపైన రేవంత్ రివ్యూ

రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రీజనల్ రింగ్ రైల్ పైన ఆయన అధికారులకు వివరించారు. భవిష్యత్అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వేలైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని ,శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరగణనలోకి తీసుకోవాలని సూచించారు.