నా కోసం ట్రాఫిక్ ఆపోద్దు.. సీఎం రేవంత్ రెడ్డి
1 min readసీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించాలని, తాను ప్రయాణించే మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.