నా బ్రాండ్ యంగ్ ఇండియా

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామన్నారు. ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ గారి సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు.యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు యంగ్ ఇండియానే తన బ్రాండ్ అని తేల్చి చెప్పారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని,రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే తాను యంగ్ ఇండియా బ్రాండ్ ను క్రియేట్ చేశానన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందన్న సీఎం ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్ అని తేల్చి చెప్పారు.