ఎమ్మెల్సీ విజయంపైన సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు
1 min read
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీ ల నాయకులతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించడానికి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వారిని కోరారు. సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడుతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు సీపీఎం నేత వీరయ్య స్పష్టం చేశారు.