మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి లొంగిపోవాలి..సీఎం రేవంత్ రెడ్డి

మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి లొంగిపోతే తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల పైన ఉన్న రివార్డుల‌ను పెంచ‌డంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామ‌ని, హెల్త్ కార్డు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నక్సలైట్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంద‌న్న ఆయ‌న చట్టపరిధిలో అవకాశం ఉన్న కేసుల‌ను ఎత్తివేయ‌డానికి ఒక క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు.124 తుపాకులను లొంగిపోయిన మావోయిస్టులు పోలీసుల‌కు అప్ప‌గించారు.ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇందులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn