మూసీ ప్రక్షాళన చేసి తీరుతా…

1 min read

ఎవరూ ఇష్టంతో మూసీలో నివసించడంలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసీలో నివసించే వారికి బెటర్ లైఫ్ ఇస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రపంచమంతా చూసి వచ్చానంటున్న కేటీఆర్ కనీస అవగాహన లేకుండా, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిందే ఈటెల మాట్లాడుతున్నారు,సొంత అభిప్రాయం లేని ఆయనపై సానుభూతి చూపాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకే మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని , దీని వల్ల  ఇంటికి వచ్చేదేం లేదన్నారు. సియోల్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ జర్నలిస్టులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొదటి దశలో బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసా, ఈసా నదులు కలిసే సంగమం వరకు తొలి దశలో అభివృద్ధి చేస్తామన్నారు. బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నామని, అక్కడ గాంధీ ఐడియాలజీ కేంద్రం, హెల్త్ అందించే వెల్ నెస్ సెంటర్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీ, ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందన్నారు.బాపూ ఘాట్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు అటు నుంచి హిమాయత్ సాగర్ కు గోదావరి జలాలు తీసుకోస్తామన్నారు. బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మాహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలో గోదావరి జలాల ఎత్తిపోతలకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. 15రోజుల్లో సిటీలో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. కేసీఆర్  లక్షన్నర కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిందని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవనంపై మేం చేసేది తప్పనిపిస్తే.. బీఆరెస్ విజన్ డాక్యుమెంట్ ఎంటో ప్రజలకు చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను కేసీఆర్ లా 80వేల పుస్తకాలు చదవలేదన్నారు.ఐదేళ్లలో హైదరాబాద్ నగర అభివృద్ధికి లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని మాత్రమే నేను చెప్పానని, ఇందులో మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కలిపి అది అంచనా వేశామన్నారు. మేం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో మా ప్రభుత్వం వాళ్లలా భూములను అమ్మలేదు, వాళ్లలా ఔటర్ రింగ్ రోడ్డు అమ్మలేదు, టెండర్లు ఇవ్వలేదన్నారు. ఈ నెల 15వరకు మా ప్రభుత్వం చేసిన అప్పులు 49వేల కోట్లు మాత్రమేనని, కేసీఆర్ చేసిన అప్పులకు ఈ పది నెలల్లో 56వేల కోట్లు లోన్ రీపే చేశామన్నారు.కేసీఆర్ చేసిన అప్పులకే పది నెలల్లో 7వేల కోట్లు అదనంగా కట్టామని ముఖ్యమంత్రి వివరించారు. లిక్కర్ సప్లయర్స్ కు కేసీఆర్ 4 వేల కోట్లు బాకీ పెట్టారన్నారు. 52వేల కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టారు,అందులో 10వేల కోట్లు మేం చెల్లించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మూసీ పునరుజ్జీవనాన్ని కేటీఆర్, హరీష్ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ వెంట వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేద్దాం , అప్పుడు ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయని ఆయన బీఆర్ఎస్ కు సూచించారు. బీఆరెస్ మెదడులో ఎంత విషం నింపుకుందో తెలియాలనే వారిని అడ్డుకోవడంలేదని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn