జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
1 min readజర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానమని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవని, కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయన్నారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు, అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది,నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని సీఎం అన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు అందజేశారు.