ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వారి భరతం పడతాం…
1 min readచెరువుల ప్రక్షాళన రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారని సీఎం అన్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్ధమే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే హైడ్రా ద్వారా… చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం..వందేళ్ల క్రితమే హైదరాబాద్ ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశారని ఆయన వివరించారు. కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమనలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుందన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం..ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందన్నారు.