హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం గూగుల్ ..సీఎం రేవంత్ రెడ్డి
1 min read
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి
ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు గా చేపట్టిన డ్రోన్ సర్వే ను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు
నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన సీఎం
తద్వారా నగరంలో నివాస ప్రాంతాలకు మౌలికసదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అభిప్రాయపడ్డారు
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు
చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్ల ను పిలువాలని ఆదేశించారు
భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని. అధికారులకు సీఎం సూచించారు