సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి అందజేసిన సీఎం
తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి.
ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించిన సోనియా గాంధీ.
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ.
