పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. అంతర్గాం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సూచించారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
