ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
1 min readతెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా మోదీతో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆయనను ప్రధానిని కోరారు. మొత్తం 20 అంశాలతో కూడిన లేఖను మోదీకి ఆయన అందజేశారు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం సూచించారు.