ఓకే వేదికపైన రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒకే వేదికపైకి వచ్చారు. ఇద్దరు నాయకులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటు నవ్వుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు సీఎం రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది.
