ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ లోని ప్రభుత్వ హైస్కూల్ లో ఆయన ఓటు వేశారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కొడంగల్ చేరుకున్న ఆయన ఓటు వేసిన వేసిన అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి పలు వినతి పత్రాలను అందజేయనున్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

