మంత్రి వర్గ విస్తరణపైన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం అనుమతి కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త పీసీసీ చీఫ్ పైన కూడా నిర్ణయం తీసుకోమని హైకమాండ్ ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా తన పదవీకాలం ముగుస్తున్నందున కొత్త వారిని నియమించాలని సూచించినట్లు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. మంత్రివర్గ విస్తరణ పైన మీడియాలో కథనాలు రకరకాల కథనాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.