బర్త్ డే కేక్ కట్టింగ్ కు సీఎం రేవంత్ నో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య తో పాటు అనేక మంది ఎక్స్ ద్వారా సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు.
సాధారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలు చేసుకోరు. కేక్ కట్టింగ్ కు ఆయన పూర్తిగా వ్యతిరేకం. పుట్టిన రోజు ఎలాంటి హడావిడి కి ఆయన ఇష్టపడరు.
