సౌదీ మృతులకు 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలనితెలంగాణ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.తక్షణమే మంత్రి అజారుద్దీన్ ను సౌదీ పంపించాలని నిర్ణయించారు. ఈ టీంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారిని కూడా పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. చనిపోయినవారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశిచించారు.
