వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన గోదావరి కి పూజలు నిర్వహించారు. గోదావరి కి చీరె,సారే సమర్పించారు. ఆ తర్వాత వరదల కారణంగా అతలాకుతలం అయిన కామారెడ్డి పట్టణాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సమీక్ష కు వెళ్లాల్సిన ఉన్నప్పుడు వాతావరణం సహకరించకపోవడంతో హెలికాఫ్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో ముఖ్యమంత్రి మెదక్ చేరుకుని అక్కడ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీప్ మహేష్ గౌడ్ ఉన్నారు.