మనమడితో అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్

బాసర లో సీఎం రేవంత్ రెడ్డి తన మనమడు రియాన్ష్ తో అక్షరాభ్యాసం చేయించారు. కుటుంబం సమేతంగా బాసర వచ్చిన ఆయన దాదాపు రెండు గంటల పాటు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం లో ఉన్నారు. దేవాలయ అభివృద్ధి పనులకు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి శంకుస్థాపన చేశారు. దాదాపు 250 కోట్లతో బాసర దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేయనున్నారు.

