దావోస్ లో ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన తెలంగాణ బృందంతో కలిసి దావోస్ వెళ్లారు. నాలుగు రోజుల పాటు దావోస్ లో ఉండనున్న ముఖ్యమంత్రి ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.

