పలుకరించుకున్న చంద్రబాబు,దగ్గుబాటి
1 min readచాలా కాలంగా ఉప్పు,నిప్పుగా ఉన్నంటున్న నారా, దగ్గుబాటు కుటుంబాలు కలిశాయి. తోడల్లుడ్లు చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదిక పైకి రావడమే కాకుండా పలుకరించుకున్నారు.అక్కా చెల్లుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమామాహేశ్వరి కూతురు నిశ్చిత్తార్థం కార్యక్రమంలో వీరు కలుసుకున్నారు. నందమూరి కుటుంబం సభ్యులంతా ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు,దగ్గుబాటి ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఒకేసారి వేదికపైకి వెళ్లి పెళ్లికూతురిని ఆశ్వీరధించారు. ఆ సమయంలో నందమూరి బాలక్రిష్ణ కూడా బావలతో కలిసి ఉండటం విశేషం.