చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనలకు ఎపి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అనపర్తికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటు అనపర్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆయన వాహనాన్ని నిలిపేశారు. దీంతో ఆయన కారు దిగి నడుచుకుంటు అనపర్తికి చేరుకోవాల్సి వచ్చింది. దారిపోడవునా వేలాది మంది కార్యకర్తలు ఆయనను అనుసరించారు. పోలీసుల తీరుపైన చంద్రబాబు నిప్పులు చెరిగారు. కార్యక్రమానికి అనుమతి ఇచ్చి అడ్డుకోవడంపైన ఆయన మండిపడ్డారు. అతిగా వ్యవహారిస్తున్న పోలీసులపైన భవిష్యత్తులో చర్యలు తప్పవని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.