ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు
1 min readతెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించారు. ఆయనను బయటకు అనుమతించకపోవడంతో నిరసనగా ఆయన లాంజ్ లో కూర్చుండిపోయారు. కలెక్టర్, ఎస్పీని కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తీవ్ర అధికార దుర్వియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తు చంద్రబాబునాయుడు నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన అనేక మంది టీడీపీ నాయకులను కూడా పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు.