17న కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంతరావు
1 min readఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలే సూచనలున్నాయి. ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 17న సోనియాగాంధీ సమక్షంలో తన కుమారుడు రోహిత్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఆయన నిర్ణయించుకున్నారు. వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ కు జై కొట్టనున్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి తన కుమారుడికి మైదక్ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. మంత్రి హరీష్ రావు కారణంగానే టికెట్ రాలేదంటు తీవ్రస్థాయిలో ఆయనపైన బహిరంగ విమర్శలకు దిగాడు. అయినప్పటికి మైనంపల్లిని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఇష్టం ఉంటే టికెట్ తీసుకుంటారు లేకుంటే లేదంటు ముఖ్యమంత్రి కామెంట్ చేశారు.
మైనంపల్లి మాత్రం తన కొడుకుకు కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడు.రోహిత్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ వ్యూాహకర్త సునీల్ కొనుగోలు హనుమంతరావుతో తాజాగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. మల్కాజ్ గిరితో పాటు మెదక్ అసెంబ్లీ సీటు కేటాయించడానికి వారు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 17న జరిగే భారీ బహిరంగసభలో సోనియా,రాహుల్ సమక్షంలో మైనంపల్లి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరి రాకతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలమైన పోటీ ఇచ్చే సూచనలున్నాయి.