ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత
1 min readఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజయ్యారు. భర్త అనిల్ తో పాటు న్యాయవాది తోడుగా ఆమె ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు వెళ్లారు.పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. అంతకు ముందు సోదరుడు, మంత్రి కేటీఆర్ , హరీష్ రావుతో కవిత భేటీ అయ్యారు. విచారణ తర్వాత ఆమె అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కవితకు మద్దతుగా అనేక మంది మంత్రులు,ఎంపిలు,ఎమ్మెల్సీలు ఢిల్లీకి చేరుకున్నారు. నేతలంతా కేసీఆర్ నివాసంతో పాటు ఈడీ ఆఫీస్ దగ్గర మోహరించారు. కవితను అరెస్ట్ చేస్తే భారీ స్థాయిలో నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమౌతోంది.