బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్
1 min readబీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి కూడా ఆయనను తొలగించింది. షోకాజ్ నోటీసుకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో సూచించారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపైన దేశ వ్యాప్తంగా ఒక వర్గం నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇదే సమయంలో రాజాసింగ్ పైన దేశ వ్యాప్తంగా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఆయన అరెస్ట్ చేశారు.