జంగారెడ్డి అస్తమయం
1 min read
బిజెపి సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. జంగారెడ్డి పార్థివదేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కాసేపు ఉంచారు. పలువురు బీజేపీ ముఖ్యనేతలు ఆయన భౌతికఘాయానికి నివాళ్లర్పించారు. 1984లో దేశవ్యాప్తంగా బీజేపీ తరుపున ఇద్దరు ఎంపిలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి కావడం విశేషం. జంగారెడ్డి హన్మకొండ నుంచి టీడీపీ పొత్తులో బీజేపీ తరుపున ఎంపిగా విజయం సాధించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును జంగారెడ్డి ఓడించడం విశేషం. జనతా పార్టీ తరుపున శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందారు.