రాజ్యసభకు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్
1 min readమాజీ ఎమ్మెల్యే,బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనను ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దల సభకు పంపాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. యూపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న రెండో తెలుగు వ్యక్తి లక్ష్మణ్ కావడం విశేషం. ఇప్పటికే ఇక్కడి నుంచి జీవిఎల్ నరసింహారావు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపించడం ద్వారా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. విజయశాంతి,మురళీధర్ రావు లాంటి వాళ్ల పేర్లను పరిశీలించినప్పటికి లక్ష్మణ్ వైపే బీజేపీ మొగ్గు చూపించింది. డాక్టర్ లక్ష్మణ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి డిపాజిట్ పొగొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా లక్ష్మణ్ పని చేశారు.