మంత్రి శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ భేటీ
1 min readతెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లా సమస్యల పైన చర్చించినట్లు ఆయన తెలిపారు. పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించాలని కోరానని ఎంపీ వివరించారు.