పార్టీ మార్పుపైన ఈటెల రాజేందర్ క్లారిటీ

పార్టీ మారుతున్నానంటు తనపైన దుష్పచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదన్న ఆయన వ్యక్తిత్వ హననం చేయోద్దని ఆయన మీడియాను కోరారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపిస్తేనే తాను పార్టీ మారానని , తనంతట తాను రాలేదని చెప్పుకోచ్చారు. మాటలు మార్చే, పార్టీలు మార్చే వ్యక్తిని తాను కాదని ఈటెల స్పష్టం చేశారు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. గొప్ప కారణం కూడా ఉండాలన్నారు. బట్ట కాల్చి మీద వేయడం మంచిది కాదని ఈటెల రాజేందర్ అన్నారు.