భూమా అఖిలప్రియ ఛాలెంజ్
1 min readఆళ్లగడ్డలో జరుగుతున్న అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. తన ఛాలెంజ్ ను లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు అందజేస్తానని స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణ పేరుతో ఎమ్మెల్యే గంగుల వర్గం లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఎమ్మెల్యే గంగులకు ధైర్యం ఉంటే కలెక్టర్ దగ్గరకు రాజీనామా లేఖతో రావాలని ఆమె సవాల్ విసిరారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి పేరుతో ఉన్న కట్టడాలను ఉద్దేశపూర్వకంగా కూలుస్తున్నారని అఖిలప్రియ ధ్వజమెత్తారు.