హరీష్ రావును కలిసిన బాలక్రిష్ణ

1 min read

తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలిశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్న బాలయ్య మర్యాదపూర్వకంగా హరీష్ రావుతో  సమావేశమయ్యారు.  బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను  బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రికి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn