చంద్రబాబుకు బెయిల్
1 min readమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల పాటు ఆయన బెయిల్ పైన ఉండనున్నారు. నవంబర్ 28న ఆయన తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంటుంది. బెయిల్ మంజూరు చేస్తు కోర్టు కొన్ని షరతులను విధించింది. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇచ్చిన కారణంగా చంద్రబాబునాయుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. గత 53 రోజులుగా చంద్రబాబునాయుడు స్కీల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.