రామోజీరావుపైన సీఐడీ కేసు
1 min readఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నిధుల మళ్లీంపు చేశారని అభియోగాలు మోాపారు.ఈ కేసులో రామోజీరావును A 1 గా, శైలజాకిరణ్ ను A 2 పేర్కొన్నారు. మార్గదర్శి వివిధ బ్రాంచిల మేనేజర్లను A 3 గా కేసులో చేర్చారు. 400 కోట్లకు పైగా మార్గదర్శి నిధులను రామోజీ గ్రూప్ లోని ఇతర సంస్థల్లోకి మళ్లీంచారని సీఐడీ చెపుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీసులపైన గత కొన్నాళ్లుగా సీఐడీ తనిఖీలు నిర్వహించింది.