సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసానికి వచ్చిన ఆయన పైన దాదాపు గంటలకు పైగా సీఎంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అఖిలేష్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.

.యాదవ్ లకు ఎంతో ఇష్టమైన సదర్ ను రాష్ట్ర
ప్రభుత్వ పండుగగా గుర్తిస్తు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. దేశం లోని యాదవ సమాజం రేవంత్ రెడ్డి ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన అన్నారు. యాదవుల హృదయం లో రేవంత్ రెడ్డి ఉండిపోతారని అఖిలేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.తెలంగాణ లో ని యాదవ వర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు ఆయన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.

